తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలేనని.. ప్రజల్ని దోచుకోవడమే మోడీ, కేసీఆర్ పని అని మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నాడు.. రూపాయి విలువ పడిపోతుంటే మోడీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ప్రజల్లో ఉత్సాహం ఉద్రేకం వచ్చిందని..గ్యాస్ ధరలు, ఉప్పులు పప్పులు ధరలు పెరిగాయన్నారు.
ఏనాడైనా కుటుంబాన్నీ నడిపితే కదా ప్రజల బాగు తెలిసేదని మోడీకి చురకలు అంటించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రైవేట్ కంపెనీ లాగా నడుస్తుందని..ఎక్కడుంది బంగారు తెలంగాణ ? అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై ఈడీ, సీబీఐని పంపిస్తున్నారని.. ఇన్ని వేషాలు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నుండి నుంచే తిరుగుబాటు మొదల య్యిందని.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళ వారసులం తామని పేర్కొన్నారు.. దేశానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు.