నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINIL) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant ) ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ | Vizag Steel Plant

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINIL) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 319 ట్రేడ్ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది.

పోస్టుల వివరాలలోకి వెళితే.. కంప్యూటర్ ఆపరేటర్, ఫిట్టర్, కార్పెంటర్, టర్నర్, మెషినిస్ట్, మెల్డర్, మెకానిక్ డిజిల్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జులై 17 లోగ అప్లై చేసుకోవాలి.

కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలానే ఫిట్టర్ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి, NCVT సర్టిఫికేట్ కలిగి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి.

కార్పెంటర్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. టర్నర్ విభాగంలో 10 ఖాళీలు వున్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి.

మెషినిస్ట్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అలానే వెల్డర్ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

డిజిల్ మెకానిక్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NSVT సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మిషన్ టూల్ మెయింటనెన్స్ భాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి, NCVT సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఎలక్ట్రీషియన్ విభాగంలో 60 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏసీ మెకానిక్ విభాగంలో 14 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలని ఇక్కడ తెలుసుకోండి https://www.vizagsteel.com/code/tenders/Advt%20Apprentices.pdf

Read more RELATED
Recommended to you

Latest news