న్యూఢిల్లీ: దేశంలో గత కొంతకాలంగా ఆయిల్ ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. అత్యధిక రేటుకి జైపూర్‌లో పెట్రోల్ రేటు ఉంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106. 27గా ఉండగా అత్యల్పగా చండీఘర్‌లో రూ. 95.70గా అమ్ముతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో విషయానికి కొస్తే.. హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41గా ఉండగా డీజిల్ ధర రూ. 97,40గా అమ్మకాలు జరుగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 89.36గా ఉంది. పెట్రల్ ధర రూ. 99.51గా ఉంది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఆయిల్ రేట్స్ పెరగడం వల్ల ఆ ప్రభావం నిత్యావసరాలపై పడుతోందని, బతుకు భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే: