తెలంగాణలో మద్యపాన వినియోగం ఎక్కువగా ఉందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మందుబాబులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఐతే కరోనా కారణంగా మద్యపానీయాల రేట్లు ఆకాశాన్ని అంటాయి. లాక్డౌన్ కారణంగా అన్ని రేట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే మద్యం సీసాల అమ్మకాలు బాగా తగ్గాయని సమాచారం. ముఖ్యంగా బీర్ల అమ్మకం పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకోనుంది. బీర్ల ధరలపై 10రూపాయలు తగ్గించాలని చూస్తుంది. డిస్టిల్లరీలో ఉత్పత్తి చేసే కొత్త స్టాకుతో కొత్త ధరలు అమలు చేయాలని చూస్తుంది. ఈ మేరకు ఈ రోజు సూచనలు జారీ చేయనున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో మందుబాబులకు పండగే అని చెప్పాలి. మరి రేట్లు తగ్గిన తర్వాతైనా అమ్మకాలు పెరుగుతాయేమో చూడాలి.