కడప జిల్లా : ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి సయోద్య అవసరమని.. ఇంత జరుగుతున్నా ప్రధాని ఒక నీరో చక్రవర్తి లాగా కెసిఆర్ ఒక సంస్కార హీనుడిగా, జగన్ ఒక పిరికిపందలాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాల విభజన ఏవిధంగా జరిగిందో సెక్షన్ 87లో కృష్ణానది జలాల యాజమాన్య బోర్డులో ఉందని.. దీనికి బాధ్యత వహించాల్సింది నరేంద్ర మోడీ ప్రభుత్వమన్నారు.
అయితే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు నరేంద్ర మోడీ తీరు ఉందని చురకలు అంటించారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నరేంద్ర మోడీకి ప్రేమ లేఖలు రాస్తూ… కేసీఆర్ కు ప్రేమ సందేశాలు పంపిస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. తన తండ్రిని తిడుతున్నా తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల కోసం కేసీఆర్ ను ఏమీ అనలేని అసమర్ధుడు జగన్ అని ఫైర్ అయ్యారు. కేంద్రం జోక్యం చేసుకుని కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కరించాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.