కరీంనగర్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదని… అది కొందరు కావాలని దాన్ని సృష్టించారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తనపై వచ్చే తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఈటల. అటు టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ… రైతు బంధు వద్దు అని తాను లేదని చురకలంటించారు. ఇన్ కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నానని పేర్కొన్నారు.
పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలని.. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్ కా సుల్తాన్ లు అని వెల్లడించారు. మీ నియోజకవర్గంలో 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇచ్చారా..? అని టీఆర్ఎస్ ఎమ్యెల్యేలను నిలదీశారు ఈటల. కాగా ఇటీవలే ఈటల రాజేందర్ బిజేపి లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగా లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.