నీటి పంచాయితీ : జగన్, కెసిఆర్ ల పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

నదీ జలాల విషయంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ పై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు… స్వీట్లు తినినిపించుకోవచ్చు…. రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా? అని ఇద్దరు సీఎంలను నిలదీశారు. బీజేపీ కేంద్రంలో ఉన్నది బోర్డులతో కలిసి ఎందుకు సమస్య పరిష్కారం చేయడం లేదని మండిపడ్డారు. ఎందుకు కేంద్రం పట్టించుకోవడం లేదని… రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు షర్మిల.

అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలని.. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని వదులుకోక పోవడమే వైఎస్సార్ టిపి వైఖరి అని స్పష్టం చేశారు. అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన ఒక్క చుక్క మాకు వద్దన్నారు. సమన్యాయం జరగాలని వైఎస్సార్ టిపి కోరుకుంటుందని…. తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ పేరు ఉచ్చరించే అర్హత లేదని మండిపడ్డారు. వైఎస్సార్ అసలైన వారసులం మేమేనని…. యోడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులం మేమేనని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news