కోవిడ్ నుండి రికవరీ అయ్యారా? లాంగ్ కోవిడ్ లక్షణాలు తెలుసుకోండి.

-

కోవిడ్ covid నుండి రికవరీ అయ్యాక కూడా కొన్ని లక్షణాలు అంత తొందరగా తగ్గవు. చాలామంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లాంగ్ కోవిడ్ లక్షణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో కరోనా నుండి రికవరీ అయిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లాంగ్ కోవిడ్ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుందో చూసుకుంటే, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది. కరోనా వైరస్ తీవ్రంగా మారిన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లాంగ్ కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

కోవిడ్ /covid
కోవిడ్ /covid

నొప్పులు

లాంగ్ కోవిడ్ లక్షణాల్లో ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కండరాల నొప్పులు ప్రధానంగా ఉంటున్నాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కరోనా ఇబ్బంది పెట్టే ప్రధానమైన సమస్యల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఒకటి. కరోనా నుండి రికవరి అయినప్పటికీ ఊపిరి తిత్తుల మీద ప్రభావం పడడం వల్ల కొన్ని రోజుల పాటు శ్వాస సంబంధ ఇబ్బందులు వస్తుంటాయి. ఛాతి నొప్పి, గొంతు మారడం మొదలగునవి కూడా కనిపిస్తుంటాయి.

గ్యాస్ట్రిక్

కరోనా వైరస్ వల్ల అనేక అవయవాల కణాల్ల మీద ప్రభావం పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అసిడిటీ, కడుపు నొప్పి, జీర్ణ సంబంధ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

అలసట

కరోనా నుమ్డి రికవరీ అయిన చాలామంది ఎదుర్కునే సమస్య.. అలసట. శరీరం బలహీనంగా మారడం వల్ల ఏ చిన్న పనిచేసినా తీవ్రంగా అలసిపోవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news