ప్ర‌కాశ్‌రాజ్‌కు చుర‌క‌లంటించిన న‌రేశ్.. ట్వీట్ వైర‌ల్‌..!

-

ఇప్పుడు టాలీవుడ్‌లో మా అసోయేషన్‌ ఎన్నికల ర‌చ్చ న‌డుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎన్నిక‌ల‌పైనే ఉంది. నిజం చెప్పాలంటే ఓ రాజకీయ ఎన్నిక‌ల‌ను తలపిస్తున్నాయ‌ని చెప్పాలి. ఇప్ప‌టికే అధ్య‌క్ష ఎన్నిక‌ల్ల పోటీ చేసేందుకు న‌టులు ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు, అలాగే న‌టి హేమ కూడా రంగంలోకి దిగారు. దీంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎవ‌రు ఎటువైపు ఉంటారా అనే ఆస‌క్తి క‌న‌ప‌డుతోంది.

ఇందులో ముఖ్యంగా న‌టుడు ప్రకాశ్‌ రాజ్ ప్యాన‌ల్‌కు మెగా ఫ్యామిలీ స‌పోర్టు పలకడంతో పాటు టాలీవుడ్‌లో మంచి ప‌ట్టున్న మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పోటీకి దిగ‌డంతో మాటల యుద్ధం న‌డుస్తోంది. ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్ ర‌చ్చ‌కు దారి తీసింది.

మంగళవారం నాడు ప్రకాశ్‌రాజ్‌ మా ఎల‌క్ష‌న్లు ఎప్పుడు జరుపుతారంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌ ట్యాగ్ త‌గిలించి పోస్టు చేశారు. ఇక ఈ ట్వీట్‌పై నటుడు నరేశ్‌ తనదైన స్టైల్‌లో కౌంట‌ర్ వేశాడ‌ని చెప్పాలి. మా అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల‌క్ష‌న్లు సెప్టెంబర్ నెల‌లో జరుపుతార‌ని, ఇదే విష‌యంపై ఎన్నోసార్లు చెప్పినా కొందరు ప‌నిగ‌ట్టుకుని అడుతున్నార‌ని ప్ర‌కాశ్‌రాజ్‌కు కౌంట‌ర్ వేశారు. అలాగే నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకమంటారా అంటే ప్ర‌కాశ్‌రాజ్‌కు దిమ్మ‌తిరిగే విధంగా చురకలు అంటించార‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news