పీఎం కిసాన్‌ లబ్దిదారుల కోసమే ఈ యాప్‌ !

-

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌(Pm kisan)లో ఉన్న రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇటీవల దాదాపు 9.5 కోట్ల మందికి రూ.20 వేల కోట్ల కిసాన్‌ స్కీం డబ్బులను జమ చేసింది కేంద్రం. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. https.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో లబ్దిదారులకు సంబంధించిన వివరాలు ఉంటాయని మనకు తెలుసు.

పీఎం కిసాన్‌ /Pm kisan
పీఎం కిసాన్‌ /Pm kisan

కానీ, ఈ వెబ్‌సైట్‌ మాత్రమే కాదు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక యాప్‌ ఉంది.పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే యాప్‌లో లబ్ధిదారుల జాబితా కూడా సెర్చ్‌ చేయొచ్చు. దీన్ని కేంద్రం రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. అదే పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌. దీన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ఎన్‌ఐసీ ఈ మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది. ఇప్పటికే ఈ యాప్‌ను దాదాపు 50 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
ఈ యాప్‌ ద్వారా రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్టేటస్‌ కూడా ఇందులోనే తెలుస్తుంది.
ఈ యాప్‌లోనే సదరు రైతుల తమ పేర్లలో మార్పుటు కూడా చేసుకోవచ్చు. రైతులకు రావాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బులు కూడా ఇందులో ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌ ఆధారంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఎనిమిదవ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులను జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 6 వేలను రైతుల ఖాతాలో మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. ఈ విధంగా రైతులకు పీఎం స్కీం ద్వారా చేయూతనందిస్తోంది కేంద్రం. వారి కోసం తయారు చేసిన ఈ యాప్‌ కూడా వాడటం సులువు. దీంతో వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వారి స్కీం స్టేటస్, ఇతర వివరాలు తెలుసుకునే అవకాశం దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news