ఇటీవలే ప్రకటించిన.. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. 13 న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరుగనుందని సమాచారం. 50 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన తెలంగాణ ఆర్థిక శాఖ.. గతం లో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష నిర్వహించింది.. శాఖల వారీగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్… ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను క్రోడీకరించి తెలంగాణ కేబినెట్ ముందు పెట్టనుంది.
ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అనేది కేబినెట్ మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జులై నెల చివరలో 50 వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.