మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పార్లమెంట్ ఆఫ్ ఇండియా(Parliament of India)కు చెందిన సంసద్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగం నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సంసద్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 39 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. హెచ్ఆర్ మేనేజర్, డిజిటల్ హెడ్, సీనియర్ ప్రొడ్యూసర్, యాంకర్/ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తదితర విభాగాల్లో ఖాళీలు వున్నాయి. బీఈ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వేర్వురు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్వహించారు. పూర్తి వివరాలని https://www.rajyasabha.nic.in/ ను సందర్శించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ప్రకటన విడుదలైన నాటి నుంచి 21 రోజుల్లోగా ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అలానే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా నెలకు రూ. 45 వేల నుంచి రూ.1.50 లక్షల వేతనం ఇస్తారు. ఈమెయిల్ [email protected].