ఉత్త‌మ్‌కుమార్‌ కు కీల‌క ప‌ద‌వి.. కానీ అనుభ‌వ‌మే లేదంట‌..!

-

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కాంగ్రెస్‌న‌కు మొద‌టి నుంచి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తూ న‌డిపిస్తున్న వ్య‌క్తి ఉత్త‌మ్‌కుమార్‌ రెడ్డి(Uttam Kumar Reddy).. ఆయ‌న రాష్ట్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పార్టీని న‌డిపించేందుకు చాలానే ప్ర‌య‌త్నించారు. మ‌రీ ముఖ్యంగా గాంధీ కుబుంబానికి అత్యంత విధేయుడిగా న‌డుచుకుంటూ వారు ఇచ్చిన ప్ర‌తి ఆదేశాన్ని అమ‌లు చేశారు. కాక‌పోతే అధికారం మాత్రం అంద‌ని ద్రాక్ష‌గానే ఉండిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న విఫ‌ల‌మ‌యిన‌ప్ప‌టికీ చాలాసార్లు ఆయ‌న పార్టీకి చేసిన కృషిని, ఆయ‌న చిత్త‌శుద్దిని చూసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి కీల‌క ప‌ద‌వి ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

ఇక ఆయ‌న సేవ‌లు వినియోగించుకోవాల‌ని కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో కొత్త‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంట‌. ఇందులోకి చాలామంది పేర్లు వినిపించినా కూడా కొత్త‌వాడైన ఉత్త‌మ్‌కే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా ఉత్త‌మ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. జులై 19నుంచే పార్లమెంట్ సమావేశాలు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఆలోగా నియామ‌కం పూర్త‌వ్వాల‌ని రాహుల్ ఆలోచిస్తున్నారంట‌. కానీ ఉత్త‌మ్‌కు ఇది వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ను చేప‌ట్టిన అనుభ‌వం లేక‌పోవ‌డంతో కొంత ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. చూడాలి మ‌రి ఉత్త‌మ్‌ఖు ఇస్తారా ఇవ్వ‌రా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news