చంద్రుని చ‌ల‌నం కార‌ణంగా 2030లో వినాశ‌క‌ర‌మైన వ‌ర‌ద‌లు.. నాసా వెల్ల‌డి..

-

అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. చంద్రుడు తిరుగుతున్న క‌క్ష్య ఆధారంగా చంద్రునిలో వ‌చ్చే చ‌ల‌నంతో స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతాయ‌ని, దీంతో 2030ల‌లో వినాశ‌క‌ర‌మైన ప‌రిస్థితులు సంభ‌విస్తాయ‌ని తేలింది. దీని వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వినాశ‌క‌ర‌మైన వ‌ర‌ద‌లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

moon wobble in 2030 can cause massive floods says nasa

చంద్రుడిలో వ‌చ్చే ఈ మార్పు వ‌ల్ల ఎక్కువ‌గా స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతాయి. దీంతో విప‌రీత‌మైన వ‌ర‌ద‌లు వ‌స్తాయి. ముఖ్యంగా అమెరికా తీర ప్రాంతం ఈ వ‌ర‌ద‌లకు నాశ‌న‌మ‌వుతుంది. ఈ వివ‌రాల‌ను నాసా వెల్ల‌డించింది. ఈ మేర‌కు స‌ద‌రు అధ్య‌య‌నంలో తెలియ‌జేశారు. చంద్రుడిలో క‌లిగే మార్పుల వ‌ల్ల భూమిపై స‌ముద్ర మ‌ట్టాలు పెరిగి అది వ‌ర‌ద‌ల‌కు దారి తీస్తుంద‌ని, అవి అత్యంత దారుణంగా ఉండేందుకు అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు అధ్య‌య‌న ప్రధాన రచయిత ఫిల్ థాంప్సన్ వెల్ల‌డించారు.

కాగా చంద్రుని కక్ష్యలో ‘చలనం’ పూర్తి కావడానికి 18.6 సంవత్సరాలు పడుతుందని థాంప్సన్ చెప్పారు. ఆయ‌న హవాయి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప‌నిచేస్తున్నారు. చంద్రుని చలనం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని, అయితే గ్లోబ‌ల్ వార్మింగ్ వ‌ల్ల కూడా వ‌ర‌ద‌లు వ‌స్తాయి క‌నుక చంద్రునిలో వ‌చ్చే మార్పుల‌ను మ‌నం గ‌మ‌నించ‌లేమ‌ని అన్నారు.

ఇక ఈ సైకిల్ ప్ర‌తి 18.6 ఏళ్ల‌కు ఒక‌సారి ఉంటుంది క‌నుక 2030లో స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతాయ‌ని, వినాశ‌క‌ర‌మైన వ‌ర‌ద‌లు వ‌స్తాయ‌ని అన్నారు. నాసా వెబ్‌సైట్ ప్రకారం చంద్రుడు త‌న‌ దీర్ఘవృత్తాకార కక్ష్యను పూర్తి చేసినప్పుడు చంద్రుడి వేగం మారుతుంది. దీని వల్ల చంద్రుడు కొద్దిగా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. దీన్నే చంద్రుని చలనం అని అంటారు. ఇది మన కళ్ళకు కనిపిస్తుంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news