కలలు భవిష్యత్తును నిర్ధారిస్తాయా?

-

సాధారణంగా ప్రతిరోజూ మనం పడుకున్నాక ఏవో కలలు ( Dreams ) వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మంచివి. కొన్ని భయంగా ఉండేవి. అందులో కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని ఉదయం లేచేసరికి మరిచిపోతాం కూడా. అయితే, ఈ కలలతో మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. క‌ల‌లు వాటి ఫ‌లితాలు ఆ వివరాలు తెలుసుకుందాం.

కలలు | Dreams | క‌ల‌లు వాటి ఫ‌లితాలు
కలలు | Dreams | క‌ల‌లు వాటి ఫ‌లితాలు
  • ఒకవేళ మీరు చనిపోయినట్లు కల వస్తే.. మీరు కంగారు పడకండి. ఎందుకంటే దీనర్థం మీ జీవితంలో ఒక అంకం పూర్తవుతున్నట్లు సంకేతం.
  • మంటలు కలలో వస్తే మీరు ఊహించనిది ఏదో జరగబోతుందని అర్థం.
  • ఒకవేళ గర్భంతో ఉన్నట్లు కల వస్తే.. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నట్లు లెక్క. ఒకవేళ కలలో పాలిస్తున్న ఆవు వస్తే.. మీ నిజ జీవితంలో మీ అమ్మ మీ అవసరాలకు అంతగా స్పందించడం లేదని అర్థమట.
  • ఒకవేళ మీకు కలలో చేపల్ని చూస్తే మీరు అదృష్టవంతులని అర్థం. మీరు చేపల్ని పడుతున్నట్లు కల వస్తే… మీకు త్వరలో డబ్బు రాబోతుందని సంకేతం.
  • కొంతమందికి కలలో పాములు వస్తాయి. తెల్లపాము కనిపిస్తే గొప్ప విజయం సాధిస్తారని అర్థం. తెల్లపాము కలలోకి వస్తే సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయట.
  • కలలో ఏదైనా పర్వతం లేదా కొండ వచ్చినట్లైతే మీ ఉద్యోగ జీవితం లేదా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని అర్థం.
  • ఒకవేళ మీ కలలో నెమలి వచ్చిందంటే త్వరలో గుడ్‌న్యూస్‌ వినబోతున్నట్లు సంకేతమట.
  • కలలో చెట్టు నిండా పండ్లతో వచ్చినట్లైతే మీకు త్వరలో డబ్బు రాబోతుందని అర్థం.
  • ఒకవేళ కలలో గాలిలో ఎగిరినట్లు వస్తే.. జీవితంలో ఎదగబోయే నిర్ణయాలు తీసుకోనున్నట్లు అర్థమట.
  • ఎవరో తరుముతున్నట్లు కల వస్తే జీవితంలో కష్టాలపై ఎక్కువగా పోరాడుతున్నట్లు.

క‌ల‌లు వాటి ఫ‌లితాలు : ఏయే క‌ల‌లు వ‌స్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుసా..?

Read more RELATED
Recommended to you

Latest news