న్యూఢిల్లీ: బంగారం ధరలు దేశీయంగా పెరిగాయి. నేడు పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 160, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగింది. అటు వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండిపై రూ.600 పెరిగింది. పెరిగిన ధరతో కలిపి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,880గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,800గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా ఉంది. విశాఖ, విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక కేజీ వెండి ధర రూ.74, 400గా విక్రయిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 69,400. బెంగుళూరులో రూ. 69,400గా ఉంది. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. బంగారం ప్రియులు బంగారం ధరలు గమనించి కోనుగోలు చేయాలి.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇవే
చెన్నై: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,210. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320
ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,890, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890
ఢిల్లీ: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,200
కలకత్తా: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,000
బెంగుళూరు: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880