ఇది కదా కావాల్సింది వెంకీ..!

-

సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చాయన్నది కాదు.. ఫైనల్ గా రేసులో ఎవరు విన్ అయ్యారన్నది కావాలి. అలానే సంక్రాంతి రేసులో తక్కువ అంచనాలతో వచ్చిన సినిమా ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేశారు. సంక్రాంతికి అసలు సిసలు పండుగ తెచ్చిన సినిమా అంటే ఎఫ్-2 అనే చెబుతున్నారు.

ముఖ్యంగా సినిమాలో వెంకీ నటనకు ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సిని ప్రేక్షకుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వెంకీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో హంగామా తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ తన మార్క్ పంచ్ డైలాగ్స్ కామెడీ పండించడంలో తనకు తానే సాటి. కొన్నాళ్లుగా తన పంథాకు దూరంగా సినిమాలు చేస్తూ వస్తున్న వెంకటేష్ ఫైనల్ గా మళ్లీ ఎఫ్-2లో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

మళ్లీ ఆడియెన్స్ కు కలిసుందాం రా.., నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాల్లోని వెంకటేష్ ను గుర్తుచేశాడు దర్శకుడు అనీల్ రావిపుడి. వెంకీ ఇప్పటికైనా ఇలాంటి సినిమాలే చేస్తూ ఆడియెన్స్ ను అలరించాలని ఆశిద్దాం. ఈమధ్య ఎలాంటి సినిమాలు చేయాలో పెద్ద సందిగ్ధంలో పడిన వెంకటేష్ తనకు వచ్చిన నచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ జానర్ ను చేస్తే అభిమానులు, ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అది ఎఫ్-2తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news