పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండే.. టెస్టు తప్పనిసరి.

-

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలు సిద్ధం అవుతున్నాయి. ఈరోజు ఉదయం 11గంటల నుండి సమావేశం మొదలు కానుంది. కోవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పార్లమెంటులో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. లోక్ సభ చర్చా ప్రాంగణంలో 280మంది సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేసారు. అలాగే మరో గ్యాలరీలో 259మంది సందర్శకుల స్థలంలో కూర్చునే అవకాశాన్ని కల్పించారు.

భౌతికదూరం పాటిస్తూ కూర్చునేలా సీట్ల అమరిక ఏర్పాటు చేసారు. ఐతే వ్యాక్సిన్ వేసుకోని వారు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉండాలని తీర్మానించారు. తొలిరోజు నలుగురు లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 29బిల్లుల మీద చర్చ జరగనుంది. కొత్తగా 15బిల్లులు కేంద్రం ప్రవేశ పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news