జాబ్ క్యాలెండర్ వివాదం.. సీఎం నివాసాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు.

-

ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటి నుండి జరుగుతున్న నిరసన అందరికీ తెలిసిందే. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మొత్తం 2.30లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని పలు విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అందులో భాగంగా నేడు, సీఎం నివాసాన్ని ముట్టడించారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్దకు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ ముట్టడి చేసారు.

క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్ కి తరలించారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు అయ్యారు. 2.30లక్షల ఉద్యోగలు భర్తీ చేసే వరకు సీఎంని వదిలిపెట్టం అని శ్రీరామ్ చినబాబు వ్యాఖ్యలు చేసారు. ఇంకా, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news