ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్..!

-

ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) లో మీకు ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది.

వాటి వివరాలలోకి వెళితే.. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఈ నూతన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో ఉంటాయి.

ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8% వరకు వడ్డీ రేట్లను అమలు చేయడం జరుగుతుంది. ఇక ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. 7 నుంచి 14 రోజులు, 15 నుండి 30 రోజుల వ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 2.7% వడ్డీని అందిస్తోంది.

అదే 31 నుంచి 45 రోజులైతే.. 2.8% వడ్డీని ఇస్తుంది. 31 నుంచి 45 రోజులైతే ​ 2.8 శాతం వడ్డీ వస్తుంది.
46 నుంచి 90 కి 3 శాతం, 91 రోజుల నుంచి 6 నెలలకి 3.5% వడ్డీ అమలు చేస్తుంది.

ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంకి 4.3% వడ్డీ రాగా ఏడాది నుంచి మూడేళ్లకి 5.1% వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలకి 5.25%, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి 4.8% వడ్డీ రేటు అందజేస్తుంది. సీనియర్​ సిటిజన్లకు 3.2% నుంచి 5.3% వరకు వడ్డీ రేట్లను ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news