పాల‌వ్యాను బోల్తా ప‌డితే ఇలా చేస్తారా.. ఎగ‌బ‌డుతున్న జ‌నం..!

-

పూర్వపు రోజుల్లో ఎవరికైనా ఆపదొస్తే అయ్యో అని జాలిపడేవారు. కానీ ప్రస్తుతం మనుషులు మారిపోయారు. జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం స్వార్థంతో బతికేస్తున్నారు. అందుకే చాలా మంది కవులు మాయమైపోతున్నడమ్మా… మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు అని తమ రచనల ద్వారా కవితల ద్వారా ప్రస్తుత పరిస్థితిని తెలిపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి కూడా మనిషిలో ఏ మాత్రం మార్పు రాలేదు.

అమ్యో పాపం అని అనాల్సిన సందర్భంలో కూడా వాళ్ల స్వార్థంతో పక్కవారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటివి మనం అనేక సంఘటనలు చూసే ఉంటాం. ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లాలో కూడా జరిగింది. మనిషి జాతి అవమానపడేలా, సిగ్గుతో తల దించుకునేలా ఉన్న సంఘటన చూసిన వారందరినీ కలిచి వేసింది.

కర్నూలు జిల్లాలో పాలవ్యాన్‌ బోల్తా పడగా… ఇది తెలుసుకున్న చుట్టు పక్కల ఉన్న స్థానికులు ఆ పాల ట్యాంకర్ లో ఉన్న పాల కోసం ఎగబడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యాను డ్రైవర్ క్లీనర్ ఎలా ఉన్నారో కనీసం పట్టించుకోలేదు. ఆ చుట్టు పక్కల వాళ్లే కాకుండా రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు కూడా ఎగబడ్డారు. నీళ్ల కోసం ఎగబడ్డ విధంగా ఇక్కడ పాల కోసం ఎగబడ్డారు. అసలు కరోనా అనేది ఒకటి ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయి… భౌతిక దూరం పాటించకుండా పాలకోసం ఎగబడ్డ దృశ్యాలను కొంత మంది సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన వారందరూ కరోనా భయం లేకుండా పాల కోసం కుస్తీలు పడుతున్న జనాన్ని చూసి నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news