మోదీ, అమిత్ షాలను చితకబాదాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లీడర్..

పార్లమెంటులో పెగాసెస్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై విరుచుకుపడింది. రాజస్థాన్ కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మోదీ, అమిత్ షాలపై మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అయిన గణేష్ గోంగ్రా మాట్లాడుతూ, ప్రధాని మేదీ, హోం మంత్రి అమిత్ షాలని చితకబాదాలని వ్యాఖ్యలు చేసారు.

నోట్ల రద్దు, జీఎస్టీ, నిత్యావసర ధరల పెరుగుదల, చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, మొదలగునవన్నీ సామాన్యుని నడ్డి విరుస్తున్నాయని, సామాన్య ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకా పెగాసస్ గురించి మాట్లాడుతూ, మన వ్యక్తిగత విషయాలు వింటారు. ఇలాంటి నీచమైన పనులు ఎవరు చేస్తారు? మోదీ, అమిత్ షాలని చితకబాదాలని వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అటు దిగ్విజయ్ సింగ్ కూడా ఈ పోస్టుని రీట్వీట్ చేసారు.

మోదీ అమిత్ షాల పై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. 2017లో దిగ్విజయ్ సింగ్ ఒకానొక పోస్టుని రీట్వీట్ చేసాడు. ఇతరులని వెధవలని చేయడంలో మోదీ నిష్ణాతుడని ఆ పోస్ట్ సారాంశం. శశి థరూర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. మోదీ తేలు వంటి వాడని, దాన్ని చేత్తో తీసివేయలేము, అలాగే చెప్పులతో కొట్టలేము అన్నాడు. మొత్తానికి ప్రస్తుతం రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.