Prabhas : ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రాజెక్ట్ K మొదలు..

-

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు ఓ శుభవార్త. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ కాంబోలో వస్తున్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్‌లో సెట్స్‌ పైకి వచ్చేసింది. ఈ సినిమాకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్వయంగా ఫస్ట్‌ క్లాప్‌ కొట్టారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్‌ హౌస్‌ అయిన వైజయంతి మూవీస్‌ తమ అధికారిక ట్విట్టర్‌ లో ప్రకటన చేసింది.

ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. హీరో ప్రభాస్‌ క్లాప్‌ బోర్డ్‌ కొట్టినట్టు ఈ పోస్టర్‌ చూస్తే… మనకు అర్థమవుతుంది. ” ఇవాళే ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము ఇండియా సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ చిత్ర బృందం ట్వీట్ కూడా చేసింది.

” ఈ గురు పూర్ణిమ రోజున ఇండియా సినిమా గురువు కోసం క్లాప్‌ కొట్టడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ అటు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన ఫేస్‌ బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఇక ఇవాళ్టి సినిమా ప్రారంభానికి ప్రత్యేకంగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ నిన్న హైదరాబాద్‌ కు చేరుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఏకంగా 500 కోట్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news