బెంగళూరు: ప్రముఖ సీనియర్ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె శ్వాసకోస సంబంధింత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో ఆమె చనిపోయారు.1949,జనవరి 6న ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో జన్మించారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో జయంతి నటించారు. 1963లో కన్నడలో ‘జెనుగూడు’ చిత్రంతో సినీ ప్రవేశం చేశారు.
రెండు తరాల నటీనటులతో కలిసి జయంతి నటించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు సినిమాల్లో కూడా ఆమె నటించారు. సుమారు 500 సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తన కెరీర్ మొత్తంలో నాలుగు సార్లు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఒకటి రాష్ట్రపతి పతకం కూడా ఆమె పొందారు.