కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా కరోనా కేసులు తగ్గలేదు. వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అలానే వందల్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక కరోనా అప్డేట్స్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..
గత 24 గంటల కరోనా వైరస్ అప్డేట్స్ వివరాలలోకి వెళితే… గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 416 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 420967 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది. గత 24 గంటల్లో 39,361 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక వ్యాక్సినేషన్ గురించి చూస్తే… ఇప్పటికి 43 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 1899874 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 435196001 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
కరోనా రికవరీలు లోకి వెళితే దేశంలో అలానే ఇంకా 411189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 35968 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30579106 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.