బోగ‌స్ నోటీసుల‌తో బాధితుల నుంచి పెద్ద మొత్తంలో వ‌సూళ్లు.. చివ‌ర‌కు!

-

ప్ర‌స్తుతం సైబ‌ర్ నేర‌గాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. కొత్త స్కీముల‌ను కూడా బేస్ చేసుకుని అమాయక ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త‌గా ఏకంగా పోలీసుల వేషంలోనే ఈ విధ‌మైన స్కాముల‌కు పాల్పడుతున్నారు నేర‌గాళ్లు. తాజాగా నకిలీ పాప్-అప్ పోలీసు నోటీసులు పంపించి ఆన్‌లైన్‌లో ఓ క‌స్ట‌మ‌ర్‌ను భారీగా జరిమానా చెల్లించమని డిమాండ్ చేశారు. కాక‌పోతే క‌థ అడ్డం తిరిగ‌డంతో ఆ ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు.

CyBer crime
Cyber crime

ముగ్గురు నిందితులు అయిన‌ గబ్రియాల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వమ్ అఆగే బి.ధినుశాంత్ లను ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ పోలీసులు తమిళనాడులో నిందిఉత‌ల‌ను అరెస్టు చేశారు. వారిని ప‌ట్టుకోవ‌డానికి ఏకంగా వారానికి పైగా ఈ ప్రాంతంలో క్యాంప్ చేసి మ‌రీ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, త్రిచ్చి, కోయంబత్తూరు, ఉధగమండలం మధ్య దాదాపు 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన నిందితులు ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కారు.

కంబోడియాకు చెందిన ఈ ముగ్గురు ఇప్పటివరకు రూ.30ల‌క్ష‌ల వ‌ర‌కు ఇలా మోసాల‌కు పాల్ప‌డి వాటిని 9౦ కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు ద‌ర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు బోగస్ నోటీసులు జారీ చేసి అమాయ‌ల‌కు ద‌గ్గ‌రి నుంచి ఈ పెద్ద మొత్తాన్ని వ‌సూలు చేశారు. డబ్బు లావాదేవీలు ఇంకా పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదు. ఇంకా చాలా వ‌ర‌కు బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలిస్తే పెద్ద మొత్తంలో డ‌బ్బులు బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news