తెలంగాణ పాలిసెట్ ఫలితాలు కాసేపటి క్రితమే విడుదల అయ్యాయి. ఈ ఫలితాలు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ నెల 17 న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షలో లక్ష 2 వేల 496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 92 వేల 557 మంది (90.30 శాతం) హాజరు అయ్యారు. ఇక ఎంపిసి లో 75 వేల 666 మంది క్వాలిఫై కాగా…బైపీసీ లో 70 వేల 736 మంది క్వాలిఫై అయ్యారు.
ఇక ఎస్సిలలో 16 వేల 940 మంది రాస్తే.. 16,938 క్వాలిఫై అయ్యారు. అలాగే.. ఎస్టీలలో 10,433 మంది పరీక్ష రాస్తే అందరూ క్వాలిఫై అయ్యారు. ఇక 53 వేల 371 మంది బాలురు పరీక్షకు హాజరు అయితే 42 వేల 595 మందికి అర్హత లభించింది. బాలికలలో 39 వేల 186 మంది హాజరు అయితే 33 వేల 71 మంది అర్హత సాధించారు. ఇక ఈ పాలిసెట్ ఫలితాలను www.detts.cgg.cov.in లేదా polycetts.nic.in, లేదా.. telangana.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చని విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.