ఏపీ అప్పులపై బీజేపీ సీరియస్.. ప్రభుత్వంపై ఆర్బీఐకు ఫిర్యాదు

-

అమరావతి: ఏపీలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు షాక్ ఇవ్వనున్నారు. విచ్చలవిడి అప్పులపై ఆర్బీఐకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు నేతృత్వంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ ప్రభుత్వం అప్పులను కట్టడి చేయాలని ఆర్బీఐకు వినతి పత్రం ఇవ్వనున్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర నేతలు ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించనున్నారు. ఏపీకిచ్చిన విభజన హామీలపై పలువురు కేంద్రమంత్రులతో సోము బృందం భేటీకానుంది.

కాగా ఏపీ సీఎం జగన్ సంక్షేమం విషయంలో అస్సలు వెనక్కి తగ్డడంలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా అమ్మఒడి, వాహనమిత్ర, కాపునేస్తం వంటి పథకాలకు నిధులను విడుదల చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ కూడా అప్పుల రూపంలో తీసుకున్నవే. దీంతో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఆదాయం లేని రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు, బీజేపీ నేతలు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. కట్టడి లేకపోతే చేయి దాటిపోయే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. దీంతో ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news