జగన్ పై అనుచిత పోస్టులు : టీడీపీ మహిళా కార్యకర్త అరెస్ట్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టింది. ఈ పోస్టులో జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన అన్యాయాలను మరియు అక్రమాలను… వెలికి తీస్తున్నట్లు ఆ సోషల్ మీడియా పోస్టుల్లో తెలుగుదేశం మహిళా కార్యకర్త పేర్కొంది.

అంతేకాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తెను కూడా… తెలుగుదేశం మహిళా కార్యకర్త టార్గెట్ చేసింది. సీఎం జగన్ కుమార్తెపై నిందారోపణలు చేసింది ఆ మహిళా కార్యకర్త. అయితే ఈ సంఘటనను సిఐడి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఆ మహిళా కార్యకర్తలు సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కుమార్తె పై నిందారోపణలు చేసినందుకుగాను కేస్ బుక్ చేశారు సిఐడి పోలీసులు. ప్రస్తుతం ఆ మహిళను… సి ఐ డి ఆఫీస్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news