దిశ ఎన్కౌంటర్ : తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీం సీరియస్

-

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు లో తాజాగా తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తింది. సుప్రీం కోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా.. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు మరో ఆరు నెలలు సమయం కావాలని సుప్రీం ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

 

 

అయితే తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పదే పదే సమయం ఎందుకు కోరుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారు.. ఇంకా ఎందరిని ప్రశ్నించాలి? అని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ కేసును అతి త్వరలో తేల్చాలని జేఐ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. కాగా దిశ రేప్ కేసులో.. నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రేప్ చేసిన స్థలంలోనే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news