ఆర్.ఆర్.ఆర్ మళ్లీ మొదలైంది

-

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాగా వస్తున్న ట్రిపుల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఈరోజు మొదలైంది. 2018 నవంబర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసిన జక్కన్న డిసెంబర్ రెండో వారం వరకు ఆ షెడ్యూల్ చేశాడు. మధ్యలో తనయుడు కార్తికేయ పెళ్లి కోసం కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి ఈరోజు షూటింగ్ రీ స్టార్ట్ చేశారు.

ఇక ఈరోజు 27వ సీన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాహుబలి సినిమాలా ఎక్కువ సమయం తీసుకోకుండా సినిమాను త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనతో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాకు పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకున్నాడట. ముందు చరణ్, ఎన్.టి.ఆర్ లకు సంబందించి సీన్స్ పూర్తి చేసి ఆ తర్వాత మిగతా సినిమా చేస్తారట. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాతో బాహుబలి రికార్డులను సైతం కొల్లగొట్టే ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు కాబట్టి ట్రిపుల్ ఆర్ పై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news