తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక ఆసక్తికరంగా సాగుతుంది. హుజురాబాద్ నియోజక వర్గంలో జెండా ఎగరవేసే విషయంలో అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్, తెలంగాన ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవల కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఈటల, ఉద్యమంలో రాళ్ళు రువ్విన వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ కి ఆప్తులయ్యారని, మానుకోటలో ఉద్యమం జరుగుతున్నప్పుడు మాపై రాళ్ళతో కొట్టిన వ్యక్తులకు ఎమ్మెల్సీలు వస్తున్నాయంటూ కామెంట్లు చేసారు.
ఉద్యమ నాయకులను కేసీఆర్ మరిచిపోయారని, వేలకోట్ల రూపాయలనే నమ్ముకుంటున్నారని అన్నారు. ఇంకా 2018లో జరిగిన ఎన్నికల్లోనే తను ఓడగొట్టడానికి కరపత్రాలు పంచారని, అప్పుడే తనపట్ల వ్యతిరేక వైఖరి చూపించారని గుర్తు చేసారు. హుజురాబాద్ పై ఇప్పటికే 150కోట్ల రూపాయలు ఖర్చు చేసారని, ఇంకా చేస్తూనే ఉన్నారని, ఈ విషయాలను ప్రజలు గమనించాలని కోరారు.