తెలంగాణ ప్రభుత్వ జీవోపై హైకోర్టు ఆశ్చర్యం.. ఎలా రాశారని ప్రశ్న

-

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టుకు సీఎస్ సోమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. తనపై కోర్టు ధిక్కరణ కోసుల కోసం రూ. 58 కోట్లు కేటాయించినవి కాదని తెలిపారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమేనని ఏజీ బీఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందు ఉంచలేకపోయామని సీఎస్ సోమేశ్ తెలిపారు. నిధుల విడుదల చేయవద్దన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. పిల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఉద్దేశం ఏమిటీ?. కాగితంపై రాసిందేమిటని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమే అన్నట్లు జీవో కనిపిస్తోందని పేర్కొంది. జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ సోమవారం జరుపుతామని, విచారణ వాయిదా వేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news