డ్రామా మాస్టర్ ని కాదు..సీరియస్ రాజకీయ నాయకున్ని : ఈటల

-

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ళు సీఎం కేసీఆర్, హరీష్ రావు మరియు కేటీఆర్ తో పనిచేశానని పేర్కొన్నారు. తాను సీరియస్ రాజకీయ నాయకుణ్ణి అని… డ్రామా మాస్టర్ ని కాదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చురకలు అంటించారు. తనకున్న ఆప్షన్ పాదయాత్ర నేనని… తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతాననని స్పష్టం చేశారు ఈటల రాజేందర్‌.

పార్టీలు, జెండాలు, సిద్ధాంతాల కంటే… కేసీఆర్ అటిట్యూట్ రాష్ట్రానికి ప్రమాదం కాబట్టి అందరూ ఒక్కటీ కావాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో 150 కోట్ల రూపాయలు నగదు రూపంలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో 57 ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు ఇస్తామన్నారు.. మూడేళ్ళ తర్వాత హుజురాబాద్ ఓట్లపై ప్రేమతో ఇప్పుడు ఇచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గొర్రెలను ఇవ్వడం సంతోషమని పేర్కొన్న ఈటల… గొల్ల కుర్మల ఓట్లు కొల్లగొట్టడానికి లబ్ధిదారుల కంట్రీబ్యూషన్ కూడా ప్రభుత్వమే కడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news