కొత్త విద్యా విధానానికి ఏపీ కెబినెట్ ఆమోదం

-

అమరావతి : కొత్త విద్యా విధానానికి ఏపీ కెబినెట్ ఆమోదించిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదు.. ఏ ఉపాధ్యాయుడి ఉద్యోగం తీసే ప్రసక్తే ఉండదన్నారు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయని.. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుందని చెప్పారు.


విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను కెబినెట్లో తీసుకున్నామని.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. 1-5 తరగతుల విద్యార్ధులకు ఒకటీ లేదా ఇద్దరు టీచర్లతో విద్యా బోధన జరుగుతోందని.. ప్రస్తుతం అమలవుతోన్న విద్యా విధానంపై సర్వే నిర్వహించామన్నారు. విద్యా ప్రమాణాలు సరిగా లేవనే విషయం సర్వే ద్వారా వెల్లడైందని.. విద్యార్ధుల జీవితాలను మనమే నాశనం చేస్తున్నామనే ఫీడ్ బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. సర్వే ఫలితాలు చూశాక.. విద్యా విధానం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. బై లింగ్వల్ టెక్స్ట్ పుస్తకాలు అచ్చు వేసిన మొదటి రాష్ట్రం ఏపీనేనని.. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news