దేశంలో పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేయడంతో గేమింగ్ ప్రేమికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆడటానికి థ్రిల్లింగ్ గేమ్ లేదని ఎంతో బాధపడ్డారు. వీరి కోసం రెండు నెలల క్రితం దేశంలో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) ల్యాంచ్ చేశారు. ఇది గేమింగ్ ప్రేమికులను తెగ నచ్చేసింది. ఎంతలా అంటే అప్పుడే 5 కోట్ల డౌన్‌లోడింగ్‌లకు సమీపించింది. ఈ మైలు రాయిని అతి త్వరలో చేరుకోనున్న నేపథ్యంలో ‘క్రాఫ్టన్’ ‘50 మిలియన్స్ డౌన్‌లోడ్స్ రివార్డ్స్ ఈవెంట్’ను ప్రకటించింది. దీనిని ప్లేయర్స్‌కు గేమ్ లోపలే ఇవ్వనున్నది.
ఈవెంట్‌లో భాగంగా మూడు మైల్ స్టోన్స్‌ల్లో ప్లేయర్లకు రివార్డ్ ఇస్తారు. 48 మిలియన్లు, 49 మిలియన్లు, 50 మిలియన్ల డౌన్‌లోడ్ మైల్ స్టోన్స్ ఇందులో ఉన్నాయి. బీజీఎంఐ 48 మిలియన్ల డౌన్‌లోడ్స్ చేరుకోగానే గేమ్ ప్లేయర్లకు మూడు సప్లయ్ కూపన్ క్రియేట్ స్క్రాప్ వస్తాయి. 49 మిలియన్లు చేరుకోగానే మూడు క్లాసిక్ కూపన్ క్రియేట్ స్క్రాప్ కూపన్లు ఇస్తారు. 50 మిలియన్ డౌన్‌లోడ్స్ చేరుకోగానే గెలక్సీ మెసేంజర్ సెట్ ప్లేయర్స్‌కు అందుతుంది. ఈ సెట్ ఎప్పటికీ గేమ్ ప్లేయర్లకు అందుబాటులో ఉంటుంది.
ఈ రివార్డ్స్ అని కూడా బీజీఎంఐలో ఈవెంట్ సెక్షన్‌లో అందుబాటులో ఉంటాయి. 50 మిలియన్ డౌన్‌లోడ్ సందర్భంగా ఇచ్చిన రివార్డ్స్ అనీ నెల రోజులపాటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్దేశిత డౌన్‌లోడ్ పూర్తికాగానే ఆటోమెటిక్‌గా రివార్డ్స్ అని అన్‌లాక్ అయిపోతాయి. ఈ వార్త రాసే సమయానికి బీజీఎంఐ 46 మిలియన్ల డౌన్‌లోడ్లను పూర్తిచేసుకుంది.