ఈ నెల 24 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పై ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ…ఈ నెల 24 నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నామని.. భాగ్యలక్ష్మి అమ్మ వారి దేవాలయం నుండి ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పాదయాత్రను ప్రకటించిన వెంటనే మేమూ నడుస్తామంటూ స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారని.. ఒక్కో జిల్లా నుండి 20 మంది మాత్రమే పాదయాత్రలో నడిచేందుకు అవకాశాన్ని కల్పించామన్నారు.

పూర్తి సమయం కేటాయించి, అనుభవం కలిగిన నాయకులను మాత్రమే పాదయాత్రలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడం… బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించాలని ఉద్యమించిన ఏకైక పార్టీ బీజేపీ అని వివరించారు. అనేక సార్లు పోలీసుల దెబ్బలు తిని జైలుపాలైన చరిత్ర బీజేపీ కార్యకర్తలదేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news