మాన్సస్ ట్రస్టు వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ట్రస్టు వివాదం.. ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ అశోక్ గజపతిరాజు ల మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. అయితే తాజాగా మాన్సస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తొలగించి తనను నియమించాలని ఊర్మిళ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ మేరకు ఏపీ హైకోర్టు లో ఊర్మిళ గజపతి రాజు ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె నే ఈ ఊర్మిళ గజపతిరాజు. అలాగే ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిరాజు. మొన్నటి వరకు సంచయిత చైర్మన్ కావాలని అని అనుకుంటున్న నేపథ్యంలో ఊర్మిళ గజపతి రాజు హై కోర్టులో పిటిషన్ వేసింది. ఊర్మిళ ను మరియు సంచయితను వారసులుగా ప్రభుత్వం గుర్తించిందని ఈ సందర్భంగా లాయరు హై కోర్టుకు విన్నవించారు. అయితే ఈ వాదనలు విన్న ఏపీ హై కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది