టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు జావెలిన్ త్రో లో నీరజ చోప్రా శనివారం పసిడి పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ బ్రో లో రికార్డు స్థాయిలో 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా కలలుకంటున్న బంగారు పతకాన్ని నిజం చేసి చూపించాడు నీరజ్ చోప్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం గెలుపొందగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్ కు లభించిన పసిడి పతకం ఇదే కావడం విశేషం.
ఇక ఈ నేపథ్యంలోనే మీరా చోప్రా కు ఖరీదైన బహుమతులు మరియు నజరానాలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే నీరజ్ పేరు ఉన్నవారికి కొన్నిచోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్ ను కూడా ప్రకటించేశారు. గుజరాత్ రాష్ట్రం భారుచ్ లోని ఓ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్ ను ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. మీరేదో పేరు ఉన్న వ్యక్తులు ఐడి కార్డు చూపి ఉచితంగా పెట్రోలు పొందవచ్చు. అంతేకాదు జునాగఢ్ లోని గిర్నార్ రోప్ వే కంపెనీ రోజు పేరు ఉన్న వ్యక్తులకు ఉచితంగా రోప్ వే లో ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఆగస్టు 20 వరకు ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.