గుంటూరు : బిటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణను మీడియా ముందు హజరుపరచారు పోలీసులు. ఈ సందర్భంగా ఈ మర్డర్ కు సంబందించిన విషయాలను మీడియాతో ఐజీ రాజశేఖర్ వెల్లడించారు. 6 నెలల నుండి రమ్య, హాంతకుడి మధ్య పరిచయం ఉందని.. ముద్దాయి తాను ప్రపోజ్ చేసిన విషయాన్ని ఒప్పుకోకపోతే అనే ఆలోచన తో కత్తి తెచ్చాడని పేర్కొన్నారు. సోషల్ మీడియా వచ్చాక యువత చాలా వికృతంగా ఆలోచిస్తున్నారని.. దిశ యాప్ ప్రెస్ చేసి ఉంటే ఆమెని 4,5 నిముషాల్లోనే పోలీస్ లు చేరుకుని వుండే వారన్నారు.
చుట్టుపక్కల వాళ్ళు స్పందించక పోవడాన్ని ఎలా చూడాలని పేర్కొన్న ఆయన.. ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కి ఉండి ఉంటే మేము స్పందించక పోయి ఉంటే మాది తప్పు అని చెప్పారు. నిందితుడికి గతం లో నేర చరిత్ర లేదని.. పబ్లిక్ అయిన అక్కడ రెస్పొడ్ అయ్యే ఉంటే ఈ మర్డర్ జరిగివుండేది కాదన్నారు. సోషల్ మీడియా నేరాలపై కంపైన్ చేయాలని డీజీపీ చెప్పారని.. ఈ అమ్మాయి అతని నెంబర్ ని బ్లాక్ చేసిందని పేర్కొన్నారు. అసలు వీరి మధ్య పరిచయం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలియదన్నారు. ఆ అమ్మాయి వాట్స్ అప్ కాల్స్ అన్ని అనలైజ్ చేస్తామని.. మార్నింగ్ జరిగిన సంఘటన శవరాజకీయమేనన్నారు. దాన్ని ఖండిస్తున్నామని.. అమ్మాయి హత్య లో ఏమైనా రాజకీయాలు లేవన్నారు. ఇలాంటి సమయం లో పొలిటికల్ పార్టీ లు కూడా ఆలోచించాలని సూచించారు.