ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. 7.ai హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగం లో మొత్తం 1500 నియామకాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో 2000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు అని సంస్థ తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 3500కు పెంచాలని అనుకుంటున్నారు అని తెలియజేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మొత్తం 5 వేల మందిని నియమించుకోవాలని కంపెనీ అనుకుంటోంది.
ప్రస్తుతం అయితే పర్మినెంట్ విభాగం లో ఈ నియమకాలు చేపడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే 7.ai సంస్థ సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది అని కూడా తెలిపింది. ఇప్పుడు నూతన నియామకాల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రం హోం విధానం లోనే పని చేయాల్సి ఉంటుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ఉద్యోగుల లో 80 శాతం మంది వర్క్ ఫ్రం హోం విధానం లోనే పని చేస్తున్నట్లు వివరించింది7.ai కంపెనీ తన సేవలను అందిస్తోంది.