తాలిబన్ల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వణికిపోతున్నారు. తమ స్వేచ్ఛ హక్కులు కోల్పోతామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు ఏ సమయాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో… ఎవర్ని పట్టుకుని చాంపుతారో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక నిన్న విమానాశ్రయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ఎలా ప్రయత్నించారో చూసి ప్రపంచం మొత్తం బాధపడింది.
అయితే ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మరో షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 4.8 తీవ్రత తో భూకంపం నమోదయింది. ఫైజాబాద్ కు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంను గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఓ వైపు తాలిబన్ల వల్ల ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రకృతి కూడా తమకు సహకరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.