ఏపీలో తెరుచుకున్న స్కూల్స్..హాజరు శాతం ఎంతంటే.. ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పాఠశాలలు తెచ్చుకోవడం ఇదే మొదటిసారి. అయితే కరోనా భయంతో విద్యార్థులను తల్లిదండ్రులు స్కూల్ల కు పంపిస్తారా లేదా అన్న అనుమానం ఉండేది. కానీ మొదటి రోజే పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాయి. మొదటిరోజు అంచనాలకు మించి 60 శాతం మంది విద్యార్థులు బడికి వచ్చారు.

దాంతో మరో పది రోజుల్లో 90 నుంచి 100 శాతం విద్యార్థులు స్కూల్ కు వస్తారని స్కూల్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో విద్యార్థులు కరోనా నిబంధనలను పాటిస్తున్నారు. ఉపాధ్యాయుల సూచన మేరకు మాస్కులు ధరించడం.. శానిటైజర్ లు రాసుకోవడం లాంటివి చేస్తూ పాఠాలు వింటున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్ కాలేజీ లలో మాత్రం విద్యార్థులు పల్చగానే కనిపిస్తున్నారు. దాంతో ఇంటర్ విద్యార్థులు పాఠశాలకు పూర్తిస్థాయిలో హాజరయ్యేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news