“లవ్ స్టోరీ” రీలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే!

-

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఫిదా బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజై ప్రేక్షకులను పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మజిలీ, వెంకీమామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్లాన్ లో ఉన్నాడు.

ఇక లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు లవ్ స్టోరీ చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ను కూడా వదిలింది చిత్రం. ఈ అప్ డేట్ తో అటు అక్కినేని మరియు సాయి పల్లవి ఫ్యాన్స్ లో… కొంత ఉత్సాహం నెలకొంది. కాగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్.ఎల్. పీ ఈ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news