టీచ‌ర్ల కోసం స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్.. !

-

తెలంగాణ‌లో పాఠ‌శాల‌ల‌ను తెరిచిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో విద్యాసంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న వారికి ముందుగా వ్యాక్సిన్ లు వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దాంతో జిహెచ్ఎంసి పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్ లు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. స్కూళ్లు తెరిచేలోపు టీచర్లకు ఒక్క డోస్ అయినా ఇచ్చేలా జీహెచ్ ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది.

పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్-టీచింగ్ స్టాప్ కు 15రోజులకోసారి టెస్టింగ్ చేసేలా కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ ద్వారా హైదరాబాదులో 2 లక్షల మంది టీచర్లకు వ్యాక్సిన్ పంపిణీ జ‌రిగింది. గ్రేటర్ లో ఫస్ట్, సెకండ్ డోస్ లభించడంతో టీకా కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్లు క‌నిపిస్తున్నాయి. ఇక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు సరిగ్గా లేకపోవడంతో జీహెచ్ఎంసి అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news