ఇండియా కంటే తెలంగాణ వృద్ధి రేటే ఎక్కువ : హరీష్ రావు

-

ఇండియా వృద్ధి రేటు కంటే… తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ అని ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని తెలిపారు. బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని… తలసరి ఆదాయం లో కూడా తెలంగాణ ముందుందన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ ఆర్థిక ప్రగతి పై ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రెట్టింపు వృద్ధి రేటు సాధించిందని… దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదన్నారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

తెలంగాణ వార్షిక వృద్ధి తలసరి ఆదాయం 11.5 గా ఉందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం లో రెండో స్థానమని వివరించారు. ఇంతలా అభివృద్ధి జరుగుతున్నా.. ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ అబద్ధాలు చెపుతున్నారని ఫైర్‌ అయ్యారు. వారిది అవగాహన రహిత్యమా ?రాజకీయ లబ్ది కోసమా ? అని ప్రశ్నించారు. తానేమి అబద్దాలు చెప్పడం లేదని… కేంద్రం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news