మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. దీని కింద వ్యక్తులకు హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్లను అందిస్తుంది. అయితే ఈ స్కీమ్స్ ద్వారా రూ. 25 వేలు, గరిష్టంగా రూ.50 కోట్ల వరకు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. ఇక ఈ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..
హెల్త్‌కేర్ క్రెడిట్ లోన్:
గుర్తింపు పొందిన ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు, హెల్త్ కేర్ సర్వీసింగ్ సెంటర్లను స్టార్ట్ చెయ్యడానికి ఇది బాగుంటుంది. ఈ పథకం కింద రూ. 10 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ఇది ఇలా ఉంటే 18 నెలల వరకు మారిటోరియం కూడా వర్తిస్తుంది. 2022 మార్చి 31 వరకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది అని బ్యాంక్ తెలిపింది.
సురక్ష పర్సనల్ లోన్:
ఈ లోన్‌పై రూ. 25 వేల నుంచి 5 లక్షల వరకు తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. అయితే కరోనా చికిత్సకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులకు వాడచ్చు. ఈ లోన్లకు 6 నెలల మారిటోరియం వర్తిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
బిజినెస్ లోన్:
ఇక బిజినెస్ లోన్ గురించి చూస్తే.. రూ.2 కోట్ల వరకు రాయితీ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లకు మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన వాటి కోసం లోన్ ఇస్తారు. పైగా ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. నాన్ ఎంఎస్ఎంఈలకు మాత్రం 25 శాతం హామీ ఇవ్వాల్సిందే. 2022 మార్చి31 వరకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.