పొలిటీకల్ ఎంట్రీ ఇవ్వనున్న సోనూసూద్… !

-

ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సేతు హిమాల‌యాల నుంచి ఇటు వింధ్యా ప‌ర్వతాల దాకా ఆయ‌న పేరునే జ‌పిస్తోంది. రీల్ లైఫ్ లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్ హీరోగా జ‌నాల గుండెల్లో నిలిచిపోయారు. అయితే సోనూ సూద్‌ త్వరలో పొలిటీకల్‌ ఎంట్రీ చేయనున్నట్లు సోషల్‌ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2022 లో బృహన్‌ ముంబై ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి గా రియల్‌ హీరో సోనూసూద్‌ దిగబోతున్నట్లు టాక్‌ వస్తోంది. ఈ విషయం లో కాంగ్రెస్‌ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

sonu sood

మేయర్‌ అభ్యర్థిని చాలా ముందుగానే ప్రకటించే ఉద్దేశం తో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి రేసులో నటుడు రితేష్‌ దేశ్‌ ముఖ్‌, ఫిట్‌ నెస్‌ పర్సనాల్టీ మిలింద్‌ సోమన్‌, మరియు సోనూ సూద్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ముగ్గురిలో ఒకరిని వచ్చే ఎన్నికల్లో పక్కాగా అభ్యర్థిగా ప్రకటిస్తారని కొందరూ నేతలు కూడా అంటున్నారు. దీంతో సోనూ సూద్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా లో ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే.. ఈ వార్తలపై తాజాగా సోనూ సూద్‌ స్వయంగా స్పందించారు. ”ఇది నిజం కాదు. సాధారణ వ్యక్తిగా నేను సంతోషంగా ఉన్నాను. రాజకీయాల్లో వచ్చే సమస్యే లేదు. ” అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. లక్షలాది మందికి సహాయం చేస్తున్న సోనూసూద్‌ రాజకీయాల్లోకి రావాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news