రానున్న 20 ఏళ్లు కూడా టిఆర్ఎస్ పార్టీ నే అధికారం లో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ ఉంటుందనీ…టివి ఛానల్ డిబేట్ లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పి పుట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
వచ్చే నెల 2 న తెలంగాణ భవన్ ఢిల్లీ లో శంకుస్థాపన చేయబోతున్నట్లు వివరించారు సీఎం కేసీఆర్. దళిత బంధు పై ప్రజలను చైతన్యం చేయాలని…దళిత బంధు ను ఉద్యమం లాగా చేయాలని ఆదేశించారు. దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని…కొత్తగా జిల్లా అధ్యక్షులను కూడా త్వరలోనే నియమిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల కంటే దళితులు వెనుకబడ్డారు కాబట్టి… మొదటగా దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.