కండోమ్ లేకపోవడంతో జిగురు పదార్థంతో ప్రయోగం.. యువకుడు మృతి.

-

గుజరాత్ అహమ్మదాబాద్ కి చెందిన ఏళ్ళ యువకుడు శృంగారంలో జరిపిన ప్రయోగానికి బలై మృత్యువాత పడ్డాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొన్న యువకుడు తెల్లారే సరికి మృత్యువై కనిపించాడని పోలీసులు పేర్కొన్నారు. కండోమ్ లేకపోవడంతో జిగురు పదార్థంతో తమ అంతర అవయవాలను దాచుకోవడానికి చేసిన ప్రయోగం విఫలమై యువకుడు మృతి చెందాడు.

అహమ్మాదాబాద్ లోని ఫతేవాడికి చెందిన సల్మాన్ మీర్జా అనే 25ఏళ్ళ యువకుడు, ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్, ఇద్దరూ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారు. జూన్ 22వ తారీఖున ఈ ఇద్దరూ కలిసి, సెక్స్ లో పాల్గొనాలనుకున్నారు. కానీ రక్షణ లేకపోవడంతో గర్భం వస్తుందన్న భయంతో ఏం చేయాలో తెలియక వారి అంతర అవయవాలను దాచుకోవడానికి జిగురు పదార్థాన్ని వాడారు.

ఇది జరిగిన మరుసటి రోజుకి ఆ యువకుడు రోడ్డు మీద పడి కనిపించాడు. అది చూసిన అక్కడి వారు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత చనిపోయినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఐతే ప్రస్తుతం ఆ యువకుడి బంధువులు ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. శరీర భాగాల్లోని అంతర అవయవాలకు సంబంధించిన శాంపిల్స్ పరీక్షచేయడానికి పంపించారు. ప్రస్తుతం ఈ పరీక్ష వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news